Tummala Nageswara Rao :టెస్కో ద్వారానే వస్త్రాలు కొనాలి
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:34 AM
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు అన్ని కూడా టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ శాఖలకు ఇది తప్పనిసరి: తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు అన్ని కూడా టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నవంబరు 15 లోగా వస్త్రాల కోసం ఇండెంట్ టెస్కోకు సమర్పించాలని వివిధ సంక్షేమ శా ఖల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం టెస్కోకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జీవో నెం.1 తీసుకొచ్చిందన్నారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమయ్యే వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పారు. జీవోకు విరుద్ధంగా ఎవరైనా ప్రైవేట్ సంస్థల నుంచి వస్త్రాలు కొంటే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని సంక్షేమ శాఖలు ప్రతి సంవత్సరం యూనిఫాం రంగులు మార్చడం వల్ల సరఫరాలో ఆలస్యం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, కాబట్టి కనీసం ఐదేళ్లు డిజైన్ మార్చకుండా ఉంచాలని సూచించారు..