Tummala : మున్నేరుకు వందేళ్లలో రానంత వరద
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:51 AM
మున్నేరు వాగుకు వందేళ్లలో ఎన్నడూ చూడనంత వరద వచ్చిందని, కొద్ది గంటల్లోనే 45 సెంటీమీటర్ల వర్షం కురవడమే దీనికి కారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గంటల్లో 45 సెం.మీవర్షపాతం కారణంగానే: మంత్రి తుమ్మల
ఖమ్మం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మున్నేరు వాగుకు వందేళ్లలో ఎన్నడూ చూడనంత వరద వచ్చిందని, కొద్ది గంటల్లోనే 45 సెంటీమీటర్ల వర్షం కురవడమే దీనికి కారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని వరద ముంపు కాలనీలు, పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించి బాధితులను పరామర్శించారు. మున్నేరు వరదతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారని.. పేర్కొన్నారు. టెస్కో నుంచి దుప్పట్లు, చీరలు, ధోతీలు, దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.