Share News

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:10 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్‌ క్రిమినల్స్‌ ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

  • ఇద్దరు నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్‌ క్రిమినల్స్‌ ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పెరుకపల్లికి చెందిన గడ్డం అనిల్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కొందుర్గుకు చెందిన సెంట్రింగ్‌ వర్కర్‌ కాశమోని రమేష్‌ సీఎం ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి ‘కేటీఆర్‌ సేన రంగారెడ్డి’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపు ద్వారా పోస్టు చేసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Oct 06 , 2024 | 04:10 AM