పురాణపండ అఖండ గ్రంధంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు త్యాగరాయగానసభ మంగళాశాసనం
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:42 PM
తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.
సికింద్రాబాద్, జూలై 23: తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి.. ఆరెస్సెస్, బిజెపి శ్రేణులకు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శ్రేణులకు ఒక శుభవార్తను ముందుంచారు. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప శ్రీవిద్యల రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ మంగళ మహిమోపేత గ్రంధాన్ని వేళా కొలది కాపీలు వితరణ చేయనున్నారు.
కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణను వచ్చేవారం సమర్పించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ శాకాంబరీ ఉత్సవాలలో, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవాలలో, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలలో సందడి చేసి అనేక పవిత్ర స్థలాల్లో దివ్యంగా ఆవిష్కరణలు జరుపుకున్న ఈ పరమాద్భుత ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ను పురాణపండ శ్రీనివాస్ ఒక యజ్ఞాగ్నిలా రూపొందించినట్లు ఉభయరాష్ట్రాల్లో అనేకమంది పండిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సర్వసనాతన ధర్మ మార్గాలను సమైక్యపరచి, సమన్వయం చేసిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల విశేష అనుగ్రహమే ఇలాంటి గ్రంధాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు రమణాచారి, కిషన్ రావు వంటి వారు పేర్కొనడం గమనార్హం.
ఎన్నో గ్రంధాలతో తెలుగు రాష్ట్రాలలో పవిత్ర నైతిక విలువల గ్రంధాల రచన, సంకలనం, వితరణలతో దూసుకుపోతున్న పురాణపండ శ్రీనివాస్ ఈ ఒక్క గ్రంధం అనేక ఆలయాలకు విస్తరించాలని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్.రామారావు ఏడవ ప్రచురణని ఆవిష్కరిస్తూ పేర్కొనడం ప్రత్యేకంగా పేర్కొనాలి.
రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో అనేక క్షేత్రాలలో ఆవిష్కరణ జరుపుకున్న ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ను విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ శ్రేణులకు అందించాలనే జనార్ధనమూర్తి సంకల్పాన్ని అందరూ అభినందిస్తున్నారు.
నిస్వార్ధంగా పవిత్ర సేవ చేస్తున్నారనే ఉత్తమ కీర్తిని పీఠాధిపతుల, మఠాధిపతుల, తిరుమల... యాదాద్రి ప్రధానార్చకుల ప్రశంసలు, అనుగ్రహం పొందిన పురాణపండ శ్రీనివాస్ రచనలు ఇప్పటికే వందల దేవాలయాల్లో, ధార్మిక మండళ్లలో, వేళా గృహాల్లో పారాయణా గ్రంథాలుగా అద్భుతంగా చలామణీ అవుతున్నాయనడానికి కనులముందు కనిపిస్తున్న శ్రీనివాస్ స్వయంకృషే కఠిన సత్యం. జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సమర్పణలో ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కథలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా అందించారు.