Telangana: అనంతగిరి పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ABN , Publish Date - Jan 15 , 2024 | 08:38 PM
హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నేతలు, అధికారులు
హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నేతలు, అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ధారూర్ మండలం కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో హైదరాబాద్ కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరిని పర్యాటక అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్నన్ని సౌకర్యాలు మరే దేశంలోనూ లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామన్నారు. మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.