Share News

Uttam : మానవజాతి శాంతియుతంగా జీవించాలి..

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:34 AM

మానవజాతి శాంతియుతంగా, సామరస్యంగా జీవిస్తూ సుస్థిరత కోసం కృషి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Uttam : మానవజాతి శాంతియుతంగా జీవించాలి..

  • యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలి

  • రాంచంద్రమిషన్‌ సేవలు ప్రశంసనీయం: ఉత్తమ్‌

నందిగామ, సెప్టెంబరు 21: మానవజాతి శాంతియుతంగా, సామరస్యంగా జీవిస్తూ సుస్థిరత కోసం కృషి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న ‘అంతర్జాతీయ రైజింగ్‌ విత్‌ కైండ్‌నెస్‌’ సదస్సులో మంత్రి ఉత్తమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులపై ఆందోళన నెలకొందని, కాలుష్యం, ఆర్థిక క్షీణతతో అనేక జాతులు తుడిచిపెట్టుకుపోతున్నాయన్నారు.


ప్రపంచంలో ఆధిపత్యం చాలా చోట్ల కోసం ఘర్షణలు జరుగుతున్నాయని, సమాజం గమనించి శాంతియుతంగా ఉండాలన్నారు. రాజకీయ అస్థిరత నుంచి ప్రపంచాన్ని బయటకి లాగడానికి, శాంతియుత జీవనం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి యువత నాయకత్వ వహించాలన్నారు. మానసిక, భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలపై ప్రజలకు బోధించడంలోనూ రాంచంద్రమిషన్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.

Updated Date - Sep 22 , 2024 | 03:34 AM