Share News

Uttam : ఫిలిప్పీన్స్‌కు ఏడాదికి 3 లక్షల టన్నుల బియ్యం

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:14 AM

నాణ్యత కారణాలతో కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్‌కు నిలిచిపోయిన బియ్యం ఎగుమతులను పునరుద్ధరించాలని, ఏడాదికి కనీసం 3లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఆ దేశానికి పంపాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Uttam : ఫిలిప్పీన్స్‌కు ఏడాదికి 3 లక్షల టన్నుల బియ్యం

  • పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నాణ్యత కారణాలతో కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్‌కు నిలిచిపోయిన బియ్యం ఎగుమతులను పునరుద్ధరించాలని, ఏడాదికి కనీసం 3లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఆ దేశానికి పంపాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల భవన్‌ నుంచి శనివారం ఫిలిప్పీన్స్‌ ఆహార, వ్యవసాయశాఖ మంత్రి రోజెర్స్‌తో ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారతదేశం నుంచి నిలిపివేసిన బియ్యం దిగుమతులను మళ్లీ పునరుద్ధరించుకోవాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైతులు నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారని, మిల్లర్లు సార్టెక్స్‌ యంత్రాలతో జల్లెడ పడుతున్నారని వివరించారు.


బియ్యం నాణ్యతను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని కోరారు. కాగా, ఇరు దేశాల మఽధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపరిచేందుకు తాను స్వయంగా ఫిలిప్పీన్స్‌ పర్యటనకు వెళ్తానని ఉత్తమ్‌ చెప్పారు. నాణ్యత ఉండటం లేదనే కారణంతోనే కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్‌ తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకోవటంలేదన్నారు. ప్రయత్నాలు ఫలించి అక్కడి ప్రభుత్వం అంగీకరిస్తే ఆ దేశానికి తిరిగి బియ్యం ఎగుమతులు చేస్తామని తెలిపారు. కేంద్రం బియ్యం ఎగుమతులపై 10ు పన్ను వసూలు చేస్తోందని, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయాల్సి వస్తే దాన్ని మినహాయించాలని విజ్ఞప్తి చేస్తామని ఉత్తమ్‌ తెలిపారు.

Updated Date - Oct 06 , 2024 | 03:14 AM