Errabelli: ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలి: ఎర్రబెల్లి
ABN , Publish Date - May 28 , 2024 | 12:39 PM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు (NT Ramarao) 101వ జయంతి (101st Jayanti) సందర్భంగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakararao) ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తనకు దైవ సమానులని.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పారు.
తాను మెదట నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకినని, 25 ఏళ్ళ వయస్సుకే తనకు ఎన్టీఆర్ వరంగల్ జిల్లా పార్టీ పదవి ఇచ్చారని ఎర్రబెల్లి తెలిపారు. ఆయన ఆశీర్వాదంతో 26 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమన్నారు. పెన్షన్లు, కిలో రెండు రూపాయల బియ్యం పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి
జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..
చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..
సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News