Share News

Vinod: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పుపై వినోద్ స్పందన...

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:11 PM

Telangana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌పై విచారణ జరిగిందని.. సుదీర్ఘ వాదనలు జరిగాయన్నారు.

Vinod: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పుపై వినోద్ స్పందన...
Former MP Vinod kumar

వరంగల్, సెప్టెంబర్ 9: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు (MLAs) సంబంధించి హైకోర్టు (Telangana High court) ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌పై విచారణ జరిగిందని.. సుదీర్ఘ వాదనలు జరిగాయన్నారు. నాలుగు వారాల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందన్నారు.

Haryana Elections: వినేశ్ ఫొగట్ హర్యానాలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా.. జాట్‌ల ఓట్లు ఎటువైపు


స్పీకర్ నిర్లక్ష్యం చేస్తే తామే విచారణ చేస్తామని హైకోర్టు చెప్పిందన్నారు. స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. 1985లో రాజీవ్ గాంధీ 52వ షెడ్యూల్ సవరణ ద్వారా పార్టీ మారే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే వారిపై అనర్హత వేటు వేయాలని చట్టం తెచ్చారన్నారు. ఒక సమయం దానిలో పెట్టకపోవడమే ఇన్ని అనర్ధాలకు కారణమన్నారు. 39 ఏళ్ల క్రితం చట్టం వచ్చినా అందులో లోసుగులు ఉండడం కొందరికి ఉపయోగంగా మారిందని తెలిపారు. ప్రధాని మోదీ అన్నీ నీతిలే చెప్తారని.. ఎన్నో చట్ట సవరణలు తెచ్చిన మోడీ ఈ చట్ట సవరణ చేయరని మండిపడ్డారు.

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐకి సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు



శాసనసభ స్పీకర్ కోర్టుతో చీవాట్లు తినాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖర్గే మాటలను తెలంగాణ స్పీకర్ వినకుండా విచారణ చేయాలని డిమాండ్ చేవారు. దేశంలోని రాజకీయ పార్టీలు పట్టుబట్టి 10వ షెడ్యూల్ రద్దు చేయాలన్నారు. స్పీకర్‌కు 4, 6 వారాల్లో నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే 10వ షెడ్యూల్ రద్దు చేయకుంటే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు గౌరవం కోల్పోతారన్నారు. ఆనాడు చట్టం తెచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ఇలాంటి స్పీకర్లు ఉంటారని అనుకోలేదన్నారు. చట్టంలో ఏ నేత తప్పు చేయకుండా చేయాలని.. తప్పు చేసే ఆస్కారం ఉండకుండా చూడాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Sep 09 , 2024 | 03:11 PM