Share News

BV Raghavulu: రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదు...

ABN , Publish Date - Jul 17 , 2024 | 10:17 AM

హనుమకొండ: రాష్ట్రంలో రైతు రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదని, కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృథానే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. రైతు మిత్రలో చిన్న, సన్నకారు రైతులకు వర్తించకపోవడం సరికాదని అన్నారు.

 BV Raghavulu: రుణమాఫీ రూపొందించిన విధానం సరిగాలేదు...

హనుమకొండ: రాష్ట్రంలో రైతు రుణమాఫీ (Farmer loan waiver) రూపొందించిన విధానం సరిగాలేదని, కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృథానే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ... రైతు మిత్రలో చిన్న, సన్నకారు రైతులకు వర్తించకపోవడం సరికాదని, పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వర్తింపచేయాలని కోరారు. రుణమాఫీ మార్గదర్శకాలు మార్పులు చేయాలన్నారు. జనగణన, కుల గణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవద్దని సూచించారు. మున్సిపల్ పరిధిలో గుడిసెలు వేసుకుని, స్థిరనివాసం కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాటిని నోటిస్ ఇచ్చి తొలగిస్తామంటే ఊరుకోమన్నారు. కార్పొరేట్ శక్తులు అక్రమంగా నిర్మించిన వాటిని పట్టించుకోకుండా... పేదలపై ప్రతాపం చూపడం సరికాదని బీవీ రాఘవులు అన్నారు.


కాగా పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. భూమి పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామన్నారు.


రాష్ట్రంలో 90 లక్షల కార్డులుండగా.. రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్‌ కార్డులు లేని 6.36 లక్షల మందికీ రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.


గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచించాలన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడూ అలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు.


ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, అక్కడ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలను నిర్వహించి, సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణ మాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాల (ఉమ్మడి జిల్లాల చొప్పున)కు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలోకి కరీంనగర్ మేయర్?

అధికారం మారిన అవే పనులు..

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఆ నేతల ఆశలు..

ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 10:17 AM