TS News: వరంగల్ జిల్లాలో విషాదం నింపిన హోలీ వేడుకలు..
ABN , Publish Date - Mar 26 , 2024 | 07:55 AM
తెలంగాణ వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. నిన్నంతా రాష్ట్ర ప్రజలు హోలీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరిగాయి. కానీ ఈ వేడుకలు పలు చోట్ల విషాదం నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
వరంగల్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా హోలీ (Holi) వేడుకలు అంబరాన్నంటాయి. నిన్నంతా రాష్ట్ర ప్రజలు హోలీ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరిగాయి. కానీ ఈ వేడుకలు పలు చోట్ల విషాదం నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ వేడుకల్లో భాగంగా అతిగా మద్యం సేవించడమో మరొక కారణమో కానీ ఏకంగా ఒక్క వరంగల్ జిల్లాలోనే 8 మంది మృతి చెందడం గమనార్హం. హనుమకొండ కాకతీయ కెనాల్‌లో పడి ముగ్గురు గల్లంతవగా.. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది.
స్నానం కోసమని సరదాగా వెళ్లి ముగ్గురు వ్యక్తులు కాకతీయ కెనాల్‌లో గల్లంతయ్యారు. ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్ప సమీపంలో హోలీ వేడుకల అనంతరం ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ చెట్టును ఢీకొట్టి మృతి చెందారు. హనుమకొండ జిల్లా శనిగరం వద్ద ఆటో బోల్తా పడటంతో ఒక యువకుడు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. హోలీ వేడుకల్లో పాల్గొని మద్యం మత్తులో ఇంటికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూరులో రెండు బైకులు ఢీ కొని, ఒక యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో చెరువులో స్నానం కోసం వెళ్లి పదేళ్ల బాలుడు రిత్విక్ రెడ్డి దుర్మరణం పాలయ్యాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.