TG News: బెట్టింగ్‌తో నష్టపోయిన వ్యక్తి ఎంత పని చేశాడంటే
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:14 PM
Telangana: వరంగల్‌కు చెందిన ఓ యువకుడు సరదా బెట్టింగ్స్ చేశాడు. సరదాగా స్టార్ట్ చేసింది కాస్తా వ్యసనంగా మారిపోయింది. చివరకు బెట్టింగ్ చేసి తన వద్ద ఉన్న మొత్తాన్ని పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు కూడా చేశాడు. బెట్టింగ్‌తో వచ్చేదేమీ లేకపోగా పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. ఇందులో బయటపడేందుకు ఆ యువకుడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు...
హనుమకొండ, అక్టోబర్ 29: నేటి సమాజంలో బెట్టింగ్‌కు యువత ఎక్కువ ప్రాధన్యతనిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఎన్నో వస్తున్నాయి. దీని వల్ల చాలా మంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెట్టింగ్ చేసి అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులను పోగొట్టుకుని.. వాటిని తీర్చలేక కొందరు యువత ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో చూశాం. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ పెడచెవినపెడుతుంటారు యువత. చివరకు బెట్టింగ్‌లో ఉన్నదంతా పోగుట్టుకోవడంతో పాటు పీకల్లోతు అప్పుల్లో మునిపోతుంటారు.
Kollu Ravindra: మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..
బెట్టింగ్ విషయం తెలుసుకున్న కొందరు కుటుంబీకులు మొదట చివాట్లు పెట్టినప్పటికీ వారిని అందులో నుంచి బయటకు లాగుతారు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం బెట్టింగ్ వల్ల నష్టపోయి అప్పులు చేయడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతుంటారు. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలని చెడు మార్గాలను ఎంచుకుంటారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్‌లో చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్‌లో నష్టపోయిన ఓ యువకుడు ఎలా మారాడు.. చివరకు అతడికి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
వరంగల్‌కు చెందిన ఓ యువకుడు సరదా బెట్టింగ్స్ చేశాడు. సరదాగా స్టార్ట్ చేసింది కాస్తా వ్యసనంగా మారిపోయింది. చివరకు బెట్టింగ్ చేసి తన వద్ద ఉన్న మొత్తాన్ని పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు కూడా చేశాడు. బెట్టింగ్‌తో వచ్చేదేమీ లేకపోగా పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. ఇందులో బయటపడేందుకు ఆ యువకుడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు అతడిని జైలు ఊచలు లెక్కించేలా చేసింది. బెట్టింగ్ యాప్‌లతో నష్టపోయిన వ్యక్తి దొంగగా మారిన ఘటన వరంగల్ జిల్లా హనుమకొండలో చోటు చేసుకుంది. బెట్టింగ్‌తో అప్పుల పాలైన సదరు వ్యక్తి దాన్ని తీర్చేందుకు దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఎంతో చాకచక్యంతో దొంగతనం చేస్తూ కొంత మొత్తాన్ని కూడబెట్టాడు కూడా. పైగా ఎంతో ఈజీగా దొంగతనం చేసేందుకు కొన్ని పరికరాలను కూడా తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి. అనేక చోట్ల బంగారం, వెండి, నగదును దొంగతనం చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు.
దొంగగా మారిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ దొంగను సీసీఎస్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 28 లక్షల 50వేల రూపాయల విలువగల 334 గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి అభరుణాలు, 13 వేల రూపాయల నగదు, ఒక ద్వివక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Harish Rao: ఇదీ.. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన ‘మార్పు’
Drugs: డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
Read Latest Telangana News And Telugu News