Share News

TG News: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 06:11 PM

తెలంగాణ అభివృద్ది గురించి కేేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పట్టదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఒంట్లో తెలంగాణ డీఎన్ఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG News: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
Ponnam Prabhakar V/s Kishan Reddy

వరంగల్: వికారాబాద్ కలెక్టర్ దాడి అంశం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్- విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కలెక్టర్‌పై దాడి, మూసి పునరావాసం అంశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ తేనె తుట్టేను కదిపినట్టయ్యింది. కేంద్రమంత్రి తీరును రాష్ట్ర మంత్రులు తప్పు పట్టారు. అసలు మీ స్టాండ్ ఏంటి.. కలెక్టర్‌పై దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.


ponnam-prabhakar.jpg


ఆయన చెప్పినట్టే..

‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సొంత అభిప్రాయం లేదు. పక్క వారు చెప్పినట్టు నడుచుకుంటారు. ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో కిషన్ రెడ్డి మూసి అంశం గురించి మాట్లాడారు. కిషన్ రెడ్డి మీ నిద్ర వీడండి. మూసీ కాలువ వాసన చూసిన తర్వాత అయినా నిజం మాట్లాడాలి. ఆ దేవుని సాక్షిగా వాస్తవాలు చెప్పాలి. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చావా..? మీరు అసలు తెలంగాణ బిడ్డేనా.. మీరు ఒక్కసారి డీఎన్ఏ పరీక్ష చేసుకోండి. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఎలా పాస్ అయ్యిందో మీకు తెలుసా..? ఆ రోజులు మరచిపోయారా అని’ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు.


kcr-12.jpg


అసలు మీ స్టాండ్ ఏంటి..

‘రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మీరు వ్యతిరేకిస్తున్నారా..? ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన అధికారులతో ప్రవర్తించేది అలాగేనా..? జిల్లా మేజిస్ట్రేట్ అయినా కలెక్టర్‌పై దాడి చేయడాన్ని సమర్థిస్తారా..? ఆ దాడిని ఖండించని మీరు కేంద్రమంత్రిగా ఉండే అర్హత కోల్పోయారు. కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారు, చేయించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై మీ వైఖరి ఏంటో చెప్పాలి. మీ పార్టీ స్టాండ్ ఏంటో బహిరంగ పరచాలి. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశావ్. ఎంపీగా సికింద్రాబాద్‌కు ఏం చేశావ్. ఇదే అంశంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రా అని’ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

Nara Rammurthy naidu: రామ్మూర్తి నాయుడు మృతిపై ప్రముఖుల సంతాపం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Nov 16 , 2024 | 06:11 PM