Share News

Telangana: కాంగ్రెస్ గెలవడానికి కారణం ఇదే.. బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:02 PM

Telangana Politics: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై ఆ పార్టీ నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ఓటమిపై కీలక కామెంట్స్ చేశారు.

Telangana: కాంగ్రెస్ గెలవడానికి కారణం ఇదే.. బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు..
Telangana

వరంగల్, జనవరి 29: ఇటీవల జరిగిన తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై ఆ పార్టీ నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) బీఆర్ఎస్ ఓటమిపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కసితో పని చేయడం వల్లే ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం పని చేసిందన్నారు. సోమవారం నాడు వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. కాంగ్రెస్ చేసే విష ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు సరిగ్గా తిప్పికొట్టలేకపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి.

గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాయని, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా తక్కువ సమయంలోనే అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ గొప్ప గొప్ప పనులు చేసినా.. ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. ఉద్యోగాల విషయంలోనూ బీఆర్ఎస్‌ను బద్నాం చేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రేమను బీఆర్ఎస్ పొందలేదన్నారు. అలాగే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు నిరంజన్ రెడ్డి.

Updated Date - Jan 29 , 2024 | 05:02 PM