Harish Rao: రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారు?
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:27 PM
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా విధివిధానాలు ఏమిటని అడిగారు. రైతు బందు పంట అయ్యాక ఇస్తారా?.. పంట ముందు ఇస్తారా? అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రెండవ స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
‘‘నాలుగు నెలల మధ్యాహ్నం భోజన కార్మికులకు జీతాలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులకు ఒక్క జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండవ జత బట్టలు అన్ని జిల్లాలకు ఇచ్చినట్లు సిద్దిపేట జిల్లకు వెంటనే ఇవ్వాలి. మన ఊరు మన బడి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్ పోసిన కాంట్రాక్టర్‌లకు 7నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల ఆసరా పెన్షన్‌లు రాలేదు. సకాలంలో పెన్షన్ రాక వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం కాలువలలో మట్టి పడి నీటి విడుదలలో ఇబ్బంది ఉంది కనుక వాటిని శుద్ధి చేయాలి. ఆరు నెలల్లో గ్రామపంచాయితీలకు రూపాయి రాలేదు. మహిళ ప్రాంగణం, వృద్ధాశ్రమం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వాడుకలోకి తీసుకురావాలి. సఖి సెంటర్ సిబ్బందికి 7నెలలుగా వేతనాలు రాలేదు’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.