Hyderabad: కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!
ABN , Publish Date - Apr 08 , 2024 | 07:52 PM
కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై టూ వీలర్స్ నిలపొద్దని స్పష్టం చేశారు. వాహనం పార్కింగ్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకున్నామని వివరించారు.
హైదరాబాద్: దుర్గం చెరువుపై (Durgam Cheruvu) గల కేబుల్ బ్రిడ్జికి (Cable Bridge) ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది. కేబుల్ బ్రిడ్జి వద్దకొచ్చి ఫొటోలు దిగేందుకు జనం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ప్లేస్ కూడా రద్దీగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి మీద ఫొటోలు దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. ఆ క్రమంలో కేబుల్ బ్రిడ్జి వద్ద టూ వీలర్స్ పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ చేయడంతో రద్దీ నెలకొంది. నిన్న (ఆదివారం నాడు) ప్రమాదం జరిగి ఒకరు చనిపోయారు.
కీలక చర్యలు
కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై టూ వీలర్స్ నిలపొద్దని స్పష్టం చేశారు. వాహనం పార్కింగ్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకున్నామని వివరించారు. తమకు జనం సహకరించాలని కోరారు. ఇకపై కేబుల్ బ్రిడ్జి వద్ద ఎక్కువ మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
నో కేక్ కటింగ్స్
ఇకపై కేబుల్ బ్రిడ్జీ వద్దకు వచ్చి, ఫొటోలు దిగేందుకు అనుమతి ఉంటుంది. సెల్ఫీలు ఎన్ని అయినా తీసుకోవచ్చు. బర్త్ డే అని కేక్ కట్ చేస్తామంటే కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. కేక్ కట్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని వివరించారు. బ్రిడ్జీ పైన కేక్ కటింగ్స్ బ్యాన్ చేశామని వివరించారు. వాహనదారులు ఈ మార్పును గమనించాలని పోలీసులు కోరారు.
ఇది కూడా చదవండి:
Janasena: జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం