Share News

Bengaluru: ప్రణీత్‌ హన్మంతు అరెస్ట్‌..

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:37 AM

తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్ముంతు అరెస్ట్‌ అయ్యాడు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్‌ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Bengaluru: ప్రణీత్‌ హన్మంతు అరెస్ట్‌..

  • బెంగళూరులో అదుపులోకి తీసుకున్న

  • తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

  • యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతు అరెస్ట్‌

  • బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్ముంతు అరెస్ట్‌ అయ్యాడు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్‌ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని అతనిని హైదరాబాద్‌ తరలించారు. ప్రణీత్‌ హన్మంతుపై ఐటీ యాక్ట్‌, బీఎ్‌సఎ్‌సలోని వివిధ సెక్షన్లతోపాటు పోక్సో యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయెల్‌ తెలిపారు.


కాగా, ప్రణీత్‌ హన్మంతు మరొకొందరితో కలిసి తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్‌ మీడియాలో చేసిన తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటులు సాయిధరమ్‌ తేజ్‌, మంచు మనోజ్‌ స్పందించి ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కాగా స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్‌ హన్మంతు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కానీ, దర్యాప్తు చేపట్టిన సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - Jul 11 , 2024 | 03:37 AM