తిరుమల బూందీ పోటులో సిట్ తనిఖీలు

ABN, Publish Date - Nov 28 , 2024 | 08:47 PM

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆ క్రమంలో రికార్డులను సైతం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందుకోసం టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం నియమించింది. అలాగే పాలక మండలి సభ్యులను సైతం ఏర్పాటు చేసింది. ఇక లడ్డూ తయారీ వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 28 , 2024 | 08:47 PM