తిరుమల బాహుబలి తీర్థం విశిష్టతలు తెలుసా..?

ABN, Publish Date - Dec 08 , 2024 | 05:34 PM

ఏడుకొండలపై వెలసిన శ్రీవారి లీలలకు సాక్ష్యాలుగా ఆ ఆలయ పరిసరాల్లో.. మరెన్నో క్షేత్రాలు వెలిశాయి. ఏడుకొండలపై శిలలే కాకుండా.. వర్షాలకు వచ్చే జలపాతాలు సైతం శ్రీవారి మహిమను ప్రతిబింబిస్తోంది. తిరుమల కొండ ముక్కోటి దేవతలకు నిలయం..ఆ క్రమంలో శేషాచల కొండల్లో్ కొలువై..భక్తులు సందర్శించే క్షేత్రాల్లో ఒకటి జపాలి తీర్థం.

ఏడుకొండలపై వెలసిన శ్రీవారి లీలలకు సాక్ష్యాలుగా ఆ ఆలయ పరిసరాల్లో.. మరెన్నో క్షేత్రాలు వెలిశాయి. ఏడుకొండలపై శిలలే కాకుండా.. వర్షాలకు వచ్చే జలపాతాలు సైతం శ్రీవారి మహిమను ప్రతిబింబిస్తోంది. తిరుమల కొండ ముక్కోటి దేవతలకు నిలయం..ఆ క్రమంలో శేషాచల కొండల్లో్ కొలువై..భక్తులు సందర్శించే క్షేత్రాల్లో ఒకటి జపాలి తీర్థం. దాని విశిష్టత ఏమిటంటే..? తిరుమల శ్రీవారి ఆలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ జపాలి హనుమాన్ ఆలయం ఉంటుంది.


తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో ఈ తీర్థం ఉంటుంది. మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి.. సుమారు రెండు కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో నడక సాగించాల్సి ఉంటుంది. ఈ జపాలి తీర్థంలో హనుమంతుడు స్వయంగా వెలిశారు. జపాలి తీర్థాన్ని హథిరాంజీ మఠానికి చెందిన మహాంతిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముక్కోటి దేవతల ప్రార్థనలతో శ్రీమహా విష్ణువు.. శ్రీరాముడిగా భూమి మీద అవతరించాడు. రుద్రుడు శ్రీరామ దూతగా వానరుడి రూపంలో అవతరించడానికి నిశ్చయించుకున్నాడు.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 08 , 2024 | 05:35 PM