Tollywood Meet: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. లైవ్ వీడియో

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:17 AM

టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, టికెట్ ధరలు పెంపు, అవార్డుల నిర్వహణ వంటి పలు అంశాలు ఈ భేటీలో చర్చకు వస్తాయి. 30 మందికిపైగా ప్రముఖులు ఈ భేటీలో ఉన్నారు.

టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ రూంలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి, టికెట్ ధరలు పెంపు, చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయింపు, అవార్డుల నిర్వహణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ సంఘటన, బెనిఫిట్ షోల రద్దు వంటి అంశాలు కూడా దీనిలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో దిల్ రాజు, నాగార్జున, అల్లుఅరవింద్, వెంకటేష్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నితిన్ వంటి 30 మందికిపైగా ప్రముఖులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

Film Industry: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. ఇందుకేనా..


నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated at - Dec 26 , 2024 | 11:24 AM