బీజేపీకి కొత్త మీనింగ్ చెప్పిన వైఎస్ షర్మిల |
ABN, Publish Date - Sep 18 , 2024 | 01:52 PM
యూఎస్ పర్యటనలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాహుల్ నిజాలు మాట్లాడితే.. తీవ్రవాదమంటారా? అని ఆ రెండు పార్టీలను ఈ సందర్భంగా ఆమె నిలదీశారు.
విజయవాడ, సెప్టెంబర్ 18: యూఎస్ పర్యటనలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాహుల్ నిజాలు మాట్లాడితే.. తీవ్రవాదమంటారా? అని ఆ రెండు పార్టీలను ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యముందా అని బీజేపీ, శివసేన నేతలను వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. అలాగే బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఆ పార్టీ మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ప్రజలను విడగొట్టి.. వారి మధ్య మంట పెట్టి అందులో చలి కాచుకుటుందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన స్పందించిన తీరును అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బుధవారం విజయవాడలో వైఎస్ షర్మిల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
Updated at - Sep 18 , 2024 | 01:52 PM