Rains In AP: వర్షాలతో స్తంభించిన ఉత్తరాంధ్ర
ABN , Publish Date - Jul 20 , 2024 | 11:25 AM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో జనజీవన స్తంభించిపోయింది. విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. 15 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గత రెండురోజుల నుంచి వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో జనజీవన స్తంభించిపోయింది. విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. 15 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గత రెండురోజుల నుంచి వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. గోదావరికి భారీ వరద వచ్చింది. సముద్రంలో 4 లక్షల క్యూసెక్కుల నీరు వదిలేయాల్సి వచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. వర్ష ప్రభావం గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.