Share News

ABN: ఏబీఎన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:11 AM

దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం నేడు. యానివర్సరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వసనీయతకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మారుపేరని ప్రశంసలు కురిపించారు.

ABN:  ఏబీఎన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
Chandrababu Naidu

దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం నేడు. యానివర్సరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వసనీయతకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మారుపేరని ప్రశంసలు కురిపించారు. ప్రజాహితం కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పనిచేస్తుందని గుర్తుచేశారు. ఏబీఎన్ చానెల్‌లో ప్రసారం అయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని గుర్తుచేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. విశ్వసనీయతను మారుపేరు ఆర్కే నిలిచారని వివరించారు.

Updated Date - Oct 15 , 2024 | 11:12 AM