AP News: ధాన్యం కొనుగోలు మరింత ఈజీగా.. ఎలాగంటే
ABN , Publish Date - Nov 17 , 2024 | 09:01 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ధాన్యం కొనుగోలు కోసం ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నంబర్‌కు వాట్సాప్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
అమరావతి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఇబ్బంది పడొద్దని ఉద్దేశంతో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగిస్తామని ప్రకటించింది. ధాన్యం విక్రయించే వారు వాట్సాప్‌లో హాయ్ అని పెడితే చాలు, ఏఐ మాట్లాడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 73373 59375 నంబర్‌కు మెసేజ్ చేయాలని ఆయన కోరారు. ఆధార్ నంబర్, రైతు పేరు, విక్రయించే ధాన్యం, ధాన్యం పరిణామం నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ సేవలను ఉపయోగించి, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం విక్రయాలు జరపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి మనోహర్ వెల్లడించారు.