Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ వార్నింగ్
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:14 PM
కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అలాంటి నేతలతో ఇబ్బంది పడుతోంది. సొంత పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి పార్టీపై పీసీసీ ఓ కన్నేసి ఉంచింది. గీత దాటినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. దీంతో అధికారంలో ఉన్న సమయంలో ఇబ్బందులు తప్పవు. తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. పార్టీలో ఉండి, సొంత పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి పార్టీపై పీసీసీ ఓ కన్నేసి ఉంచింది. గీత దాటినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. తీన్మార్ మల్లన్న హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని టీ పీసీసీ దృష్టికి వచ్చింది. ఇదే అంశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావించారని తెలిసింది. తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్ రెడ్డి మందలించినట్టు సమాచారం. తీన్మార్ మల్లన్న కాకుండా.. నోరు జారిన ఇతర నేతల గురించి సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.