Home » Teenmaar Mallanna
తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై త్వరలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని నిఖిల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునంటూ సొల్లు వాగుడు వాగుతున్నాడని తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తనకు నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నాడన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో కుమ్మక్కు అయి.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అలాంటి నేతలతో ఇబ్బంది పడుతోంది. సొంత పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి పార్టీపై పీసీసీ ఓ కన్నేసి ఉంచింది. గీత దాటినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు.
తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితం (By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.
శాసనమండలి నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.
వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.