Bandi Sanjay: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ స్పందన..
ABN, Publish Date - Aug 18 , 2024 | 08:05 PM
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు.
హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని అన్నారు. వాటితో ప్రజలకేం సంబంధం? అని అన్నారు. ఇదే అంశంపై ఇటీవల విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై, ఆ పార్టీ అగ్ర నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టి బొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ నిలదీశారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ విలీన డ్రామాలను తెరమీదకు తీసుకువస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Updated at - Aug 18 , 2024 | 08:05 PM