Yearender 2024: మోదీకి మళ్లీ కలిసొచ్చిన వేళ..
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:17 PM
ప్రధాని నరేంద్ర మోదీకి 2024 కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ ఓటరు ఎన్డీయేకు మరోసారి పట్టం కట్టారు. దీంతో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకుగాను బీజేపీ 240 స్థానాలను గెలుచుకొంది. దీంతో లోక్ సభలో అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు అవసరం కావడంతో.. ఎన్డీయే మిత్ర పక్షాలు తెలుగుదేశం పార్టీ, జేడీ (యూ), ఎల్‌జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్), జేడీ (ఎస్) తదితర పార్టీల భాగస్వామ్యంతో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది.
Also Read: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం
గతం అలా.. నేడు ఇలా...
గతంలో మిత్ర పక్షాల అవసరం లేకుండా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ ఏడాది అంటే 2024లో జరిగిన ఈ ఎన్నికల్లో మాత్రం అది సాధ్యం కాలేదన్నది సుస్పష్టం. ఇక ప్రధాని మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలుపొంది.. హ్యాట్రిక్ కొట్టారు. మోదీ గత కేబినెట్‌లోని పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు మరోసారి ఘన విజయం సాధించారు. దీంతో మోదీ.. తన రెండో కేబినెట్‌లో కొనసాగిన మంత్రులనే తాజాగా తన కేబినెట్‌లో.. అదే శాఖలను కేటాయించిన విషయం విధితమే.
Also Read: కువైట్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రచారంలో అలా.. ఉత్తరప్రదేశ్‌లో..
అయితే ఈ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు గెలుచుకొంటామని బీజేపీ అగ్రనేతలు.. తమ ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాల్లో ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం కేవలం 240 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ స్థానాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో సత్తా చాటిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం అంతగా తన ప్రభావం చూపలేకపోయింది. అంటే బీజేపీ కేవలం 35 ఎంపీ స్థానాలనే గెలుచుకొంది. ఇక ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ వాదీ అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇదే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు విచాయి.
Also Read: లయోలా కాలేజీ యాజమాన్యంపై మార్నింగ్ వాకర్స్ ఫైర్
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన..
ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలున్నాయి. వాటిలో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇక మిగిలిన హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని వరుసగా ఎంఐఎం కైవసం చేసుకొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. దీంతో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన రెండు స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ఇక వైఎస్ఆర్ సీపీ మాత్రం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
ప్రతిపక్ష హోదా దక్కించుకొన్న కాంగ్రెస్..
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని సైతం దక్కించుకోలేక పోయింది. అలాంటి ఆ పార్టీ...ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాస్తా కూస్తో తన సత్తాను చాటుకొంది. అంటే 99 స్థానాలను కైవసం చేసుకొంది. అయితే మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ గెలుపొందారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది.
Also Read: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
వయనాడ్ ఉప ఎన్నిక అనివార్యం..
మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. రాయబరేలి నుంచి సైతం విజయం సాధించారు. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా ఎంపీగా ఆమె.. లోక్ సభలో తొలిసారి అడుగు పెట్టారు. వరుసగా మూడోసారి గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ సమం చేసినట్లు అయింది.
సార్వత్రికంతోపాటు నాలుగు రాష్ట్రాలకు..
దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 17వ తేదీన తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. జూన్ 1వ తేదీతో మలి విడత లేదా చివరి దశ పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలతోపాటు మరో నాలుగు రాష్ట్రాలు.. ఆరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News
మరిన్నీ తెలుగు వార్తలు కోసం.