Share News

ROAD : దారంతా గుంతలే..!

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:27 AM

నగర శివారు ప్రాంతంలో రైల్వే గేటు వద్ద నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు అధ్వానంగా మారిం ది. దారంతా గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన సమీపంలో నాయక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద నుంచి 44వ జాతీయ రహదారి వరకు దాదాపు 3 కి.మీ రోడ్డు గుంతల మయంగా ఉంది.

ROAD : దారంతా గుంతలే..!
A bumpy road like this...

నాయక్‌నగర్‌ రైల్వే గేటు నుంచి జాతీయ రహదారి వరకూ అధ్వానంగా రోడ్డు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

రాప్తాడు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): నగర శివారు ప్రాంతంలో రైల్వే గేటు వద్ద నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు అధ్వానంగా మారిం ది. దారంతా గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన సమీపంలో నాయక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద నుంచి 44వ జాతీయ రహదారి వరకు దాదాపు 3 కి.మీ రోడ్డు గుంతల మయంగా ఉంది. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన వద్దకు రైలులో ప్రభుత్వం పేదలకు అందించే బియ్యం సరఫరా అవుతాయి. ఆ బియ్యాన్ని లారీలలో రైల్వే స్టేషన నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా జిల్లాలోని వివిద ప్రాంతాలకు సరఫరా చేస్తారు. బియ్యం వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో దారంతా దెబ్బతింది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద కంకర రాళ్లు తేలాయి. దీంతో వాహనదారులు ఆ దారి గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో బియ్యం లారీలు రోడ్డుపై వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి చెలరేగుతోంది. రాప్తాడు నుంచి నాయక్‌నగర్‌ రైల్వే గేటు మీదుగా అనంతపురం నగరానికి ద్విచక్రవాహనదారులు అధికంగా వెళుతుంటారు. అయితే దారి సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఆ రోడ్డును బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 13 , 2025 | 12:27 AM