Share News

JATARA : వైభవంగా అమ్మవార్ల జాతర

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:27 AM

మండల పరిధి లోని కల్లూరు, పాపినేపాళ్యం గ్రామా ల్లో మంగళవారం సుంకులమ్మ, చౌ డేశ్వరిదేవి అమ్మవార్ల జాతర వైభ వంగా జరిగింది. జాతర సందర్భంగా రెండు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా ఆలంకరించారు. ఆయా గ్రామాల్లో మంగళవారం ఉదయం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

JATARA : వైభవంగా అమ్మవార్ల జాతర
TDP leaders visiting Sunkulamma in Kallur

గార్లదిన్నె, మార్చి 11 (ఆంఽధ్రజ్యోతి): మండల పరిధి లోని కల్లూరు, పాపినేపాళ్యం గ్రామా ల్లో మంగళవారం సుంకులమ్మ, చౌ డేశ్వరిదేవి అమ్మవార్ల జాతర వైభ వంగా జరిగింది. జాతర సందర్భంగా రెండు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా ఆలంకరించారు. ఆయా గ్రామాల్లో మంగళవారం ఉదయం భక్తులు అమ్మవార్లకు బోనాలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరను తిలకించడానికి వివిధ గ్రా మాల నుంచి భారీ సంఖ్యలో భక్తు లు తరలివచ్చి అమ్మవార్లను దర్శిం చుకుని తీర్థ ప్రసాదాలు తీసుకు న్నారు. శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటి మడుగు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ, డీసీ చైర్మన శేఖర్‌, ఇల్లూరు రామాంజి, బాబయ్య, పాండు, గుత్తాబాలకృష్ణ, జయారం, అంజి, రాము, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

నాగసముద్రంలో...

చెన్నేకొత్తపల్లి: మండలపరిధిలోని నాగసముద్రం గ్రామంలో చెరువు కట్ట కింద వెలసిన గ్రామదేవత ముత్యాలమ్మ దేవతకు జ్యోతులు, బోనాల ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో పెద్తఎత్తున మహిళలు జ్యోతులు, బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ముత్యాలమ్మ దేవతకు వాటిని సమర్పించి పూజలు నిర్వహించారు. స్థానికులే కాకుండా వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.త

Updated Date - Mar 12 , 2025 | 12:27 AM