Ex MLA : అవే ద్వారా నిజాయితీపరులకు అవార్డులు
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:30 AM
అవే సంస్థ ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేయనున్నట్లు అవే సంస్థ వ్యవస్థాపకులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం అర్బన, జనవరి 12(ఆంధ్రజ్యోతి) : అవే సంస్థ ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేయనున్నట్లు అవే సంస్థ వ్యవస్థాపకులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు. సమాజంలో అవినీతి పెచ్చు మీరి, సామాజిక రుగ్మతగా తయారైన సమయంలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల ను గౌరవించే సమాజం అవసరమన్నారు. అందులో భాగం గానే అవే సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న హైదరాబాద్ రవీంద్ర భారతిలో 12 మంది నిజాయితీపరులైన ఉద్యో గులకు అవే సంస్థ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఉద్యో గులు అవార్డు తీసుకునేందుకు రానుపోను చార్జీలు సంస్థనే భరిస్తుం దన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. వివిధ రాష్ర్టాల్లో వేతనం మీద బతుకుతూ, నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగు లను అనేక మార్గాల ద్వారా అన్వే షించి అవార్డులకు ఎంపిక చేస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా మెలికే వ్యక్తులను ఆహ్వానిస్తున్నా మన్నారు.
త్వరలో కార్యక్రమానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రక టిస్తామన్నారు. నిజా యితీ పరులను వెలికి తీసి వారి ఔన్నత్యాన్ని, నిజాయితీని చాటి చెప్పినప్పుడు, వారిని చూసి స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకు వెళ్లే అవకాశం ఉంద న్నారు. సమాజంలో అవినీతి, అక్రమాలు, అన్యాయం జరగకూడదని మనం అంటున్నామ ని, కానీ నీతిగా బతికే వ్యక్తులను మనం ఎంత మందిని గౌరవిస్తున్నామో ఒక సారి ప్రశ్నించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక హితం కలిగిన వ్యక్తులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. లంచం తీసుకోకుండా పనిచేసే ఉద్యోగుల వివరాలు తమకు అందజేస్తే వాటిపై పలు మార్గాల ద్వారా సమీక్ష చేసి అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....