Share News

BUS STAND : 15 ఏళ్ల తరువాత బస్టాండ్‌లోకి బస్సులు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:20 PM

నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్‌ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్‌ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.

BUS STAND : 15 ఏళ్ల తరువాత బస్టాండ్‌లోకి బస్సులు
Passengers boarding the bus at Shinganamala RTC bus stand

ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, ప్రజలు

శింగనమల జనవరి 13(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్‌ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్‌ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు. దీంతో ప్రయాణికులు, మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శింగనమలలో ఆర్టీసీ బస్టాండ్‌ను 1989లో నిర్మించారు. అయితే కొన్నిరోజులు బస్సులు బస్టాండ్‌లోకి వచ్చి, వెళ్లేవి. అయితే బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది లేకపోవడంతో దాదాపు 15 ఏళ్లగా బస్సులు బస్టాండ్‌ ఆవరణంలోకి రావడం లేదు. ఉన్న మూడు బస్సుల ను బస్టాండ్‌ పక్కన రోడ్డులో నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునే వారు. దీంతో బస్టాండ్‌ నిరూపయోగంగా మారి శిథిలావస్ట కు చేరు తోందని శింగనమల గ్రామస్థులు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. అమె బస్టాండ్‌ను పరిశీలించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడా రు. అలాగే ఈ 6న శింగనమలలో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆర్టీసీ డీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్టీసీ ఆధికారులు బస్సులను బస్టాండ్‌ అవరణంలోనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుం టున్నారు. బస్సుల వేళల ఫ్లెక్సీని బస్టాండ్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్ల తరువాత బస్సులు బస్టాండ్‌ అవరణంలోని శింగన మల మండల ప్రజలు, ప్రయాణికులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతు న్నా రు. అలాగే ఆర్టీసీ బస్టాండ్‌ మరమ్మతులకు నిధులు మంజురు చేయా లని, బస్టాండ్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 13 , 2025 | 11:20 PM