Share News

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

ABN , Publish Date - Feb 11 , 2025 | 12:08 AM

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం
Chairman administering albendazole to a student in Hindupuram

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నులిపురుగుల నివారణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నివారణతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. వైద్యులు ఆనంద్‌బాబు, మంజుశ్రీ, హెచఎం సామ్రాజ్యం పాల్గొన్నారు.

ఫ సోమందేపల్లి: మండల కేంద్రంలో సోమవారం విద్యార్థులకు వైద్యులు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో వైద్యులు హరికుమార్‌, ఓంకార్‌లు విద్యార్థులకు మాత్రలు మింగించారు. మనోహర్‌రెడ్డి, రవీంద్ర, రత్నమ్మ, ఏఎనఎం శారద పాల్గొన్నారు.

ఫ గోరంట్ల: మండలంలోని 7,150 మంది పిల్లలకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆల్బెండజోల్‌ మాత్రలను సోమవారం మింగించారు. గోరంట్ల ఎమ్మార్సీ పాఠశాల, అంగనవాడీ కేంద్రాల్లో డాక్టర్‌ శృతి, డీపీఎం నాగరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీహెచఈఓ రమణ, పీహెచఎన భాగ్యలక్ష్మి, ఎంపీహెచఎఏలు రంగనాథ్‌, గాయత్రి, సువర్ణ పాల్గొన్నారు.


ఫ చిలమత్తూరు: ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవడం వలన ఆరోగ్యవంతంగా ఉండొచ్చని డాక్టర్‌ రామక్రిష్ణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించారు. సీహెచఓ జయచంద్రకుమార్‌, టీడీపీ నాయకులు నాగేంద్ర, అశ్వత్థప్ప, బ్రహ్మానందరెడ్డి, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఫ అగళి: ప్రతి చిన్నారికి నులిపురుగుల మందులు వేయాలని ఎంఈఓ-2 చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. ఇనగలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఆయన నులిపురుగుల మందులను వేశారు. వైద్యులు శివానందగాయిత్రి, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ పెనుకొండ: పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలని జిల్లా క్షయ, కుష్టివ్యాధి నివారణ అధికారి డా.తిప్పయ్య సూచించారు. సోమవారం పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు అంగనవాడీ కేంద్రాల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్‌ మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో ఎనఎ్‌సఎ్‌స పీఓలు హఫీజ్‌, శంకర్‌నాయక్‌, శ్రీలేఖ పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 12:08 AM