TREES CUTTING : పట్టుపరిశ్రమ కార్యాలయంలో చెట్ల నరికివేత
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:34 AM
జిల్లా పట్టుపరిశ్రమ శాఖ కా ర్యాలయంలోని చెట్లను మంగళవారం కొట్టివేశా రు. అయితే కార్యాలయ పర్యేవేక్షకులు, జిల్లా అధికారికి తెలియకుండా కొట్టివేయడంపై అను మానాలు తలెత్తుతున్నాయి. దాదాపు పదెకరాల విస్థీర్ణమున్న పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం లో రీలింగ్ యూనిట్, సంచార రైతు శిక్షణ,, సాంకేతిక సేవ, పట్టుపరుగుల ఉత్పత్తి కేంద్రా లు ఉన్నాయి.
అనంతపురం సెంట్రల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా పట్టుపరిశ్రమ శాఖ కా ర్యాలయంలోని చెట్లను మంగళవారం కొట్టివేశా రు. అయితే కార్యాలయ పర్యేవేక్షకులు, జిల్లా అధికారికి తెలియకుండా కొట్టివేయడంపై అను మానాలు తలెత్తుతున్నాయి. దాదాపు పదెకరాల విస్థీర్ణమున్న పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం లో రీలింగ్ యూనిట్, సంచార రైతు శిక్షణ,, సాంకేతిక సేవ, పట్టుపరుగుల ఉత్పత్తి కేంద్రా లు ఉన్నాయి. అదేవిధంగా ఐదెకరాల విస్తీర్ణం లో మల్బరీ మొక్కలు పెంచి పట్టు రైతులకు పంపిణీ చేస్తున్నారు. దశాబ్దాల వయసు ఉన్న వందలాది చెట్లున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మల్బరీ మొక్కలు పెంచే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. మిగిలిన కేంద్రాలు వినియో గంలో లేకపోవడంతో మూతపడ్డాయి. వాటి ఆవరణలో చెట్లు ఏపుగా పెరిగాయి. కార్యా లయంలోని ప్రతి చెట్టును జిల్లా అటవీ శాఖ గణాంకాల్లో చేర్చి, నంబర్లను కేటాయించి గుర్తులు వేశారు. కార్యాలయంలోని ఏ చెట్టు ను కొట్టాలన్నా అనుమతి తీసుకోవాలి. కానీ ఎవరి అనుమతి లేనిదే పలు చెట్లను కొట్టి వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ... తనకు తెలియ కుండా చెట్లను కొట్టివేశారని తెలిపారా. రీ లింగ్, ట్విస్టింగ్ యూనిట్ల షెడ్ల రేకులపైౖ పడు తున్నందున కొట్టివేసినట్లు సిబ్బంది చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఏ ఉద్దేశంతో కొట్టివేశారో సమాధానం చెప్పాలని బాధ్యులకు మెమో జారీచేస్తామన్నారు. కట్టెలు, మొద్దులను విక్రయించమని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....