MLA ; రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ పంపిణీ
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:32 AM
రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభు త్వం తమదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.9.70 లక్షల చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం అర్బన, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభు త్వం తమదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.9.70 లక్షల చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధితులు ప్రత్యేక కృ తజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైద్య పరంగా అధికంగా ఖర్చులు పెట్టుకొనే వారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. పార్టీలకతీతంగా అందిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....