Share News

BOARD : అధికారం మారినా... మారని బోర్డులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:39 AM

నిబంధన ప్రకారం అధికారి బదిలీ అయినా, సస్పెన్షన లేదా పదవీవిరమణ పొం దిన వెంటనే పాత అధికారి స్థానంలో కొత్తగా బాధ్యత లు తీసుకున్న అధికారి పేరును రెండు మూడు రోజుల్లో చేర్చాలి. అయితే అధికారి మారి దాదాపు రెండు నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రికార్డు లు, బోర్డుల్లో పాత అధికారి పేరే కనిపిస్తోంది.

BOARD : అధికారం మారినా... మారని బోర్డులు
Old official Shafi's name on information board

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): నిబంధన ప్రకారం అధికారి బదిలీ అయినా, సస్పెన్షన లేదా పదవీవిరమణ పొం దిన వెంటనే పాత అధికారి స్థానంలో కొత్తగా బాధ్యత లు తీసుకున్న అధికారి పేరును రెండు మూడు రోజుల్లో చేర్చాలి. అయితే అధికారి మారి దాదాపు రెండు నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రికార్డు లు, బోర్డుల్లో పాత అధికారి పేరే కనిపిస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ (డీఎస్‌డీఓ) అధికారి షఫీ వివిధ ఆరోపణలల నేపథ్యంలో గత సంవత్సరం నవంబరు 14వ తేదీన సస్పెండ్‌ అయ్యారు. దీంతో శ్రీసత్యసాయి జిల్లా డీఎస్‌డీఓగా ఉన్న ఉదయ్‌భాస్కర్‌ను ఆ స్థానంలో నియమించారు. అయితే అశోక్‌నగర్‌ డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలోని కార్యాలయంలో సమాచార హక్కు చట్టం, ఉద్యోగులు, కోచల వివరాలు తెలిపే బోర్డుల్లో పాత అధికారి పేరే కనిపిస్తోంది. కొత్త అధికారి పేరు ఎప్పుడు చేరుస్తారో చూడాలి.


వెస్టునరసాపురంలో...

శింగనమల: ప్రభుత్వం మారిన అర్నెల్లు దాటింది. కానీ ఆ గ్రామ సచివాలయంపై ఉన్న అప్పటి సీఎం జగన, నవరత్నాల పథకాల బొమ్మల ను ఇప్పటికీ తొలగించలేదు. గత వైసీపీ హయాంలో మండలంలోని వెస్టునరసాపురం సచివాలయంపై జగన, నవరత్నాల బొమ్మ వేశారు. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో అప్పట్లో అధికారులు వాటిపై పేపర్లు అతికించి మూసివేశారు. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు అన్ని సచివాలయాలపై నవరత్నాల బోర్డులను పగు లగొట్టిగానా, రంగులు వేసిగానీ కనిపించకుండా చేశారు. వెస్టునరసా పురంలో మాత్రం పేపర్‌ అతికించి విడిచి పెట్టారు. ఇటీవల ఆ పేపర్‌ ఊ డిపోవడంతో సచివాలయంపై జగన నవరత్నాల బొమ్మలు కనబడుతు న్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి అర్నెల్లు గడిచినా వాటిని తొలగించక పోవడం పట్ల టీడీపీ కార్యాకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 16 , 2025 | 12:39 AM