JC : రుణాల రికవరీపైదృష్టి సారించాలి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:28 AM
రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జ్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ సూచించారు. స్థానిక ఎన్టీఆర్ సహకార భవనలో బుధవారం ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు చెల్లించాలని తెలిపారు.
ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జ్, జేసీ శివనారాయణశర్మ
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జ్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ సూచించారు. స్థానిక ఎన్టీఆర్ సహకార భవనలో బుధవారం ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గం సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు చెల్లించాలని తెలిపారు. జిల్లాలో రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎనపీఏ తగ్గించాలని సూచించారు. నూతన సంవత్సరం స్పూర్తితో బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని, రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి (డీసీఓ) అరుణకుమారి, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ సురేఖరాణి, ఆప్కాబ్ మేనేజర్ దినేష్, బ్యాంకు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....