Share News

FIRE : లారీ దగ్ధం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:30 AM

మండలంలోని కల్లూరు సమీపంలోని తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమయ్యింది. పోలీసులు తెలిపిన మేరకు రాజస్థాన రాష్ట్రంలోని మైరైనా జిల్లాకు చెందిన డ్రైవర్‌ గాంధార్‌ సింగ్‌, క్లీనర్‌ రామ్‌ధీర్‌ ఇద్దరు ఈనెల 20న గోధుమల లోడుతో బెంగళూరుకు బయల్దేరారు.

FIRE : లారీ దగ్ధం
A burning wheat truck

తిమ్మంపేట వద్ద ఘటన

గార్లదిన్నె, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లూరు సమీపంలోని తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఓ లారీ దగ్ధమయ్యింది. పోలీసులు తెలిపిన మేరకు రాజస్థాన రాష్ట్రంలోని మైరైనా జిల్లాకు చెందిన డ్రైవర్‌ గాంధార్‌ సింగ్‌, క్లీనర్‌ రామ్‌ధీర్‌ ఇద్దరు ఈనెల 20న గోధుమల లోడుతో బెంగళూరుకు బయల్దేరారు. మూడురోజుల నుంచి ప్రయాణించడంతో వాహనం వేడెక్కిందని డ్రైవర్‌ ఆదివారం తెల్లవారుజామున తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారి పక్కనే నిలిపి నిద్రపోయాడు. అయితే అప్పటికే వేడెక్కి ఉండటంతో ఇంజనలో నుంచి మంటలు చెలరేగాయి. అప్ర మత్తమైన లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో కలిసి మంటలను ఆదుపుచేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు. ఎస్‌ఐ మహమ్మద్‌గౌ్‌సబాషా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు ప్రయత్నించారు. చివరకు అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే లా రీ క్యాబిన పూర్తిగా కాలిపోయింది. లారీలోని గోధుమలు కొద్దిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 40 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2025 | 12:30 AM