Fire Accident: అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం
ABN , Publish Date - Jan 02 , 2025 | 07:27 AM
అనంతపురం: నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెండిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
అనంతపురం: నగరంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో బస్సులు (Busses) దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ (Anantapur RTC Bus Stand) సమీపంలో జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy)కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుప్రక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఋదవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్ధంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, స్టీల్‌ప్లాంట్‌లో రాత్రి షిఫ్టులో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంతా బీహార్‌వాసులేనని స్థానికులు చెబుతున్నారు. యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News