Share News

DUTY: విధుల పట్ల నిర్లక్ష్యం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:35 AM

జిల్లా కేంద్రానికి కూత వేటు దూ రంలో ఉన్న మండలంలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి పశువైద్యశాలలకు పశు వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కారు. మధ్యాహ్నం తరువాత పూర్తిగా విధులకు డమ్మా కొడుతున్నారు.

DUTY: విధుల పట్ల నిర్లక్ష్యం
Even at 9 o'clock in the morning, the veterinary hospital arrives without opening

రాప్తాడు, ప్రసన్నాయపల్లి పశువైద్యశాలల్లో

వైద్యులు, సిబ్బంది తీరు ఇది

రాప్తాడు, ఫిబ్రవరి 25(ఆంద్రజ్యోతి): జిల్లా కేంద్రానికి కూత వేటు దూ రంలో ఉన్న మండలంలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి పశువైద్యశాలలకు పశు వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కారు. మధ్యాహ్నం తరువాత పూర్తిగా విధులకు డమ్మా కొడుతున్నారు. దీంతో రైతులు వైద్యులు ఉన్నప్పుడే పాడి పశువులకు చికిత్స లు చేయించుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని పశు వైద్యశాలలో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లైవ్‌ స్టాక్‌ ఆధికారి, ఇద్దరు అటెండర్లు పని చేస్తున్నారు. ప్రసన్నాయపల్లి పశు వైద్యశాలలో ఒక జూనియర్‌ వెటర్న రీ అధికారి, అటెండర్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని మంగళవారం ఆంధ్రజ్యోతి పరిశీలనలో బయట పడింది. రోజూ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నట్టు పలు వురు స్థానికులు వెల్లడించారు. రాప్తాడులో ఉదయం 9 గంటలకు పశు వైద్య శాలను ప్రారంభించాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా 9:30కు తాళాలు తీశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాళం వేసి వెళ్లిపోయారు. తి రిగి 2 గంటల నుంచి 4 గంటల వరకూ పశువైద్య శాలలో ఉండాల్సిన అధికారులు, సిబ్బంది తిరిగిరాలేదు. జిల్లా పశువైద్య కార్యాలయంలో ఏ దైనా పని నిమిత్తం అసిస్టెంట్‌ డైరె క్టర్‌ వెళ్లినా... సిబ్బందిలో ఏవరో ఒక రైనా పశువైద్య శాలలో ఉంచాలి.


ఫీల్డ్‌కు వెళుతున్నామని డుమ్మా

మధ్యాహ్నం 2గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకూ గ్రామా లకు దూరంగా పొలాల్లో ఉన్న పశు వులకు చికిత్స చేసేందుకు వెళుతున్నా మని చెబుతూ అధికారులు, సిబ్బం ది విధులకు పూర్తిగా డుమ్మా కొడు తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నా యి. వాస్తవంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ బయట ప్రాం తానికి వెళ్లి పశువులకు చికిత్స చేయలేదని తెలుస్తోంది. గ్రామానికి దూ రంగా పొలాల్లో ఉన్న పశువులకు అవసరమైనప్పుడు చికిత్స అందించేందు కు ప్రతి గ్రామ సచివాలయంలో ఏహెచఏ (అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌) ఉంటారు. అలాగే ప్రసన్నాయపల్లి పశువైద్యశాలను మంగళ వారం ఉదయం ఆలస్యంగా 9 గంటల తరువాత ప్రారంభించారు. మద్యాహ్నం ఒంటి గంట కూడా కాకముందే పశువైద్యశాలకు తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత అందుబాటులో ఉండాల్సిన జూనియర్‌ వెటర్నరీ అధికారి, అటెండర్‌ కూడా తిరిగిరాలేదు.

ఫ ఈ విషయంపై రాప్తాడు పశువైద్యశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ను వి వరణ కోరగా... మధ్యాహ్నం నుంచి ఫీల్డ్‌కు వెళుతున్నామని తెలిపారు. ఉదయం సమయానికి పశువైద్యశాల తెరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 26 , 2025 | 12:35 AM