SANKRANTI : సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:24 PM
నగర శివార్లలోని శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంక్రాం తి పండుగను పురస్కరించుకుని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏఓ క్రిష్ణప్రసాద్ సంబరాలను ప్రారంభించారు.
అనంతపురం రూరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నగర శివార్లలోని శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంక్రాం తి పండుగను పురస్కరించుకుని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏఓ క్రిష్ణప్రసాద్ సంబరాలను ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం భోగి మంటలు వేశా రు. రంగన్న వారి బృందంచే గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహించారు. మాన స నృత్యకళా కేంద్రం ఆధ్వర్యంలో మహాగణపతి, స్వాగతం కృష్ణా, గోదా రి గట్టుమీద, కెరటాల నడుము తదితర గేయాలకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. కళాకారులు కీర్తిశ్రీ, అనూష, పల్లవి, సాయిప్రసాద్, నిక్షిత, జ్ఞాన హారికా, వైష్ణవి, హర్షిత, గౌతమి, అనుశ్రీ, పృధ్వీ, భరత తదితరులు పాల్గొన్నారు.
ఫ రామగిరి/కనగానపల్లి: సంక్రాంతి సందర్భంగా రామగిరి, కనగాన పల్లి మండలాల్లో సోమవారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే వీధుల్లో భోగి పంటలు వేశారు. ఇళ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....