Share News

SANKRANTI : సంక్రాంతి ఎఫెక్ట్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:13 AM

ప్రజా ప్రయాణ ప్రాంగణాలపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్‌ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులంతా దాదాపు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎటుచూసినా రోడ్లన్నీ వాహనాలమయమైంది.

SANKRANTI : సంక్రాంతి ఎఫెక్ట్‌
Passengers competing for seats in the bus

ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్లు

అనంతపురం కల్చరల్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రయాణ ప్రాంగణాలపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్‌ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులంతా దాదాపు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎటుచూసినా రోడ్లన్నీ వాహనాలమయమైంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో అనంత ఆర్టీసీ బస్టాండు కిక్కిరిసి పోయింది. ఎటు నుంచి ఏ బస్సు వచ్చినా ఆయా రూట్లకు సంబంధించిన ఊర్ల ప్రయాణికులు బస్సుల్లో సీట్లు పట్టుకునేందుకు పోటీ పడ్డారు. పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 266 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. బస్టాండుకు వచ్చిన ప్రతి బస్సు ప్రయాణికులతో నిండి వెళ్లడం కనిపించింది. ఇదిలా ఉండగా శనివారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసి రద్దీగా కనిపించాయి. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో ఆర్టీసీ పోలీసులు రోడ్లపైకి చేరుకుని ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2025 | 12:13 AM