SSBN : విద్యార్థులకు సిరివరం
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:14 AM
విద్యయా అమృత మశ్నుతే అంటూ ఎదిమిది దశాబ్దాల క్రితం సిరివరం ఆదినారాయణ రావు ఏర్పాటుచేసిన ఎస్‌ఎస్‌బీఎన కళాశాల విద్యార్థుల కు వరంగా మారింది. 1944లో ఓ గుడిసెలో పా ఠాల బోధనతో ప్రారంభమైన కళాశాల నేడు మర్రి మానులా విస్తరించింది. ఈ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.
అన్ని రంగాల్లోనూ ’ఎస్‌ఎస్’బీఎన మార్క్
సమ్మేళనంతో తరలివచ్చిన విద్యార్థిలోకం
మధురస్మృతులను పంచుకుని ఆనందించిన పూర్వ విద్యార్థులు
అనంతపురం సెంట్రల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): విద్యయా అమృత మశ్నుతే అంటూ ఎదిమిది దశాబ్దాల క్రితం సిరివరం ఆదినారాయణ రావు ఏర్పాటుచేసిన ఎస్‌ఎస్‌బీఎన కళాశాల విద్యార్థుల కు వరంగా మారింది. 1944లో ఓ గుడిసెలో పా ఠాల బోధనతో ప్రారంభమైన కళాశాల నేడు మర్రి మానులా విస్తరించింది. ఈ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. సమాజంలోని అన్నిరం గాల్లో తన విద్యార్థులను భాగస్వాములను చేసి కొత్త మార్క్‌ను సాధిం చింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దశదిశలా ఎస్‌ఎస్‌బీఎన విద్యార్థులు స్థిరపడ్డారు. వారందరిని ఒక చోటకు చేర్చేలా శుక్రవారం నుంచి ఆది వారం వరకు మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన సమ్మేళనానికి కళా శాల పూర్వ విద్యార్థిలోకం వందలాదిగా తరలివచ్చింది.
మొదటి రోజు జాతీయోన్నత పాఠశాల, రెండో రోజు జూనియర్ కళాశాల, మూడోరోజు డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థు ల సమ్మేశనం నిర్వహించారు. వారు పాఠశాల, కళాశాలలో చదువుకున్న రోజుల్లోని మధురస్మృతులను ఒకరి నొకరు పంచుకుని సంబరపడ్డారు. తరలివచ్చిన విద్యార్థులు వారి మధు ర స్మృతులు సెల్‌పోన్లలో బంధించి వారి స్నేహితులతో పంచుకున్నారు. నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాచారం లేకపోవడంతో సుదూ ర ప్రాంతాల నుంచి రాలేకపోయారని ఒకింత బాధను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.... వ్యవస్థాపకులు సిరివరం ఆదినారాయణ రావు దూరపు చూపుతో ఏర్పా టుచేసి వేలాదిమంది విద్యార్థులకు భవిష్యత్తు ను అందించారని హర్షాన్ని వ్యక్తంచేశారు. పిల్లా పాపలు, స్నేహితులతో వచ్చి నాటి విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకోవడం మధుర ఘట్టంగా నిలిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....