MLA : విద్యారంగం అభివృద్ధిపై రప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:06 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
శింగనమల జనవరి4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్, మంత్రి నారా లోకేశ ప్రత్యేక ప్రణాళికతో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజనం ప్రవేశ పెట్టారన్నారు. అదేవిధంగా శింగనమల జూనియర్ కళాశాలలో సైన్సు గ్రూపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
శింగనమల జిల్లా పరిషత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన బోయ సురేష్ ఆధ్యర్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విద్యార్థులకు శనివారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థుల చదువులపై ఉపాధ్యా యు లు, తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండ ల ప్రత్యేకాధికారి మల్లికార్జున, తహసీల్దార్ సాకే బ్రహ్మయ్య, ఎంపీడీఓ నిర్మిలకుమారి, ఎంఈఓలు నరసింహరాజు, శివప్రసాద్, ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్, టీడీపీ మండల కన్వీనర్ ఆదినారాయణ, నాయకులు దండు శ్రీనివా సులు, డేగల కృష్ణమూర్తి, శాలిని, బోయ సత్యనారాయణ, బోయ సురేష్, మాసూల చంద్ర, ఎం.ఆదినారాయణ, చితంబరిదొర, కుమ్మెత చండ్రాయు డు, పట్రా ఎర్రిస్వామి, అనిల్, గుర్రం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....