COMPETITIONS: రాతిదూలం లాగుడు పోటీలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:47 AM
మండలపరిధిలోని కల్లూరులో కొండకింద వెలసిన సింగరప్ప స్వామి దేవాలయం వద్ద శనివారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో నాగర్ కర్నూల్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి యేటా మాదిరిగానే మాఘమాసం నాలుగో శనివారం ఆరుపళ్ల వృషభాలకు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూల్, నాగర్ కర్నూల్, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 12 జతల వృషభాలు పాల్గొన్నాయి.

గార్లదిన్నె, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కల్లూరులో కొండకింద వెలసిన సింగరప్ప స్వామి దేవాలయం వద్ద శనివారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో నాగర్ కర్నూల్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ప్రతి యేటా మాదిరిగానే మాఘమాసం నాలుగో శనివారం ఆరుపళ్ల వృషభాలకు పోటీలు నిర్వహించారు. జిల్లాతో పాటు కర్నూల్, నాగర్ కర్నూల్, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 12 జతల వృషభాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా రాయవరానికి చెందిన ఆక్షరరెడ్డి వృషబాలు 5031 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా నంద్యాల జిల్లా ఎస్ కొత్తూరుకు చెందిన బీరం సుబ్రహ్మణ్యేశ్వ రరెడ్డి బీరం బుల్స్ 4984 అడుగులు లాగి రెండో స్థానంలో, పెద్దకోట్లకు చెందిన బోరెడ్డి నారాయణరెడ్డి వృషభాలు 4737 అడుగులతో మూడో స్థానంలో, పాలంపల్లెకు చెందిన ప్రసాద్, సోమయాజులపల్లెకు చెందిన నరసయ్య వృషభాలు 4592 అడుగులతో నాలుగో స్థానంలో నిలిచాయి. కర్నూల్ జిల్లా పందికోనకు చెందిన షేక్ మహిమున్న, మల్లెల పవనకుమార్ వృషభాలు 4515 అడుగులతో ఐదో స్థానంలో, అనంతపురం జిల్లా రాయల చెరువుకు చెందిన కాశెపల్లె స్వాతిక్‌రెడ్డి, జయచంద్రారెడ్డి వృషభాలు 4200 అడుగులతో ఆరో స్థానంలో నిలిచాయి. అలాగే నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఉంగరానిగుండ్లకు చెందిన ప్యాపిలి తనుశ్రీ, పెద్దయ్య వృషభాలు 3912 అడుగులతో ఏడో స్థానంలో, బేతంచెర్ల మెకాల బాణుజా వృషభాలు 3538 అడుగులతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. అనంతపురం జిల్లా బి. యాలేరుకు చెందిన చరణ్‌రెడ్డి, మురళిశీధర్‌రెడ్డి వృషభాలు 3394 అడుగులు లాగి తొమ్మిదో స్థానంలో నిలిచాయి. విజేతలైన వృషభాలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో నిర్వాహకులు పిల్లల రామకృష్ణ, రైస్‌మిల్ వెంకట్రాముడు, మందుడుగు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....