Student Death: విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఉద్రిక్తం
ABN , Publish Date - Feb 18 , 2025 | 10:49 AM
Anantapur: జిల్లాలో ఇంటర్ విద్యార్థి మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆలమూరు రోడ్డులోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థి స్టూడెంట్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఆలమూరు రోడ్డులోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో (SR Junior Collage) ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాంత్ అనే విద్యార్థి కళాశాల వెనుక వైపు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని.. వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి శ్రీకాంత్ స్వస్థలం ధర్మవరం మండలం మల్కాపురం గ్రామం. అయితే ఎస్‌ఆర్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఫీజుల పేరుతో వేధించడంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులను కళాశాలలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు ఇంత జరుగుతున్నప్పటికీ ఎస్‌ఆర్ కళాశాల సిబ్బంది అడ్రస్ లేకుండా పోయారు.
ఘోర ప్రమాదం.. తల్లకిందులైన విమానం..
కాలేజ్ వద్ద ఉద్రిక్తత...
మరోవైపు.. ఎస్‌ఆర్ కాలేజ్ వద్ద శ్రీకాంత్ కుటుంబసభ్యల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి శ్రీకాంత్ మృతదేహంతో ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల బంధువుల నిరసనకు దిగారు. కళాశాల వేధింపులతోనే తమ కుమారుడు మృతి చెందాడని విద్యార్థి బంధువుల ఆందోళన చేపట్టారు. కాలేజ్ యాజమాన్యమే తమ కుమారుడిని చంపారని ఆరోపించారు. విద్యార్థిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. తమ కుమారుడి ఒంటిపై దెబ్బలు ఉన్నాయని, రక్తపు మరకలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. విద్యార్థి మృతి చెందినట్లు ఉదయం 6 గంటలకు తెలిసినా కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని విద్యార్థి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవుకోడానికి తమ బిడ్డను కాలేజీకి పంపిస్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, కాలేజీ యాజమాన్యాన్ని పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని ఎస్‌ఆర్ కాలేజ్ ఎదుట కూర్చుని బంధువులు నిరసన చేపట్టారు. ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తీరుపై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం..
పోలీసుల తీరుపై విద్యార్థి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్న వారికి మాత్రమే నన్యాయం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. కాలేజే యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ కాలేజీలోకి వెళ్లడానికి శ్రీకాంత్ బంధువులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కళాశాల యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహించారు శ్రీకాంత్ బంధువులు. కళాశాల ప్రిన్సిపల్ జగదీష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News