Share News

FIELD : పొలాన్ని తవ్వారు... వదిలేశారు

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:21 AM

‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్‌ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు.

FIELD : పొలాన్ని తవ్వారు... వదిలేశారు
A scene of digging a field for red soil

- చదును చేసి ఇవ్వమంటే బెదిరిస్తునారు

- ఓ దళిత రైతు ఆవేదన

శింగనమల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్‌ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు. మండలం లోని పెద్ద జలాలపురానికి చెందిన చంద్రశేఖర్‌ అనే దళిత రైతు దివ్యాం గుడు. మండలంలోని జూల్వాకాలువ రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ల 307-5, 375-1లలో అతడికి ఎనిమిదెకరాల డి- పట్టా పొలం ఉంది. అదంతా కొండ ప్రాంతం. ఎర్రమట్టి ఉంది. దీంతో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం కాంట్రాక్టరు, రోడ్డు పనులు చేసే కంపెనీ ప్రతినిధులు అతడితో ఒప్పందం చేసుకున్నారు. భూమిలోని ఎర్రమట్టి తవ్వి తరలించుకుంటామని, మళ్లీ భూమిని చదును చేయిస్తామ ని వారు హామీ ఇచ్చి ఎర్రమ ట్టి తవ్వకాలు చేపట్టారు. అత డి పొలంలో దాదాపు ఎకరా స్థలంలో వంద మీటర్ల గుంత తవ్వి ఎర్రమట్టిని తరలించా రు. పనులు అయిపోయి నాలుగు నెలలు గడిచింది. భూమి చదును చేయడం గురించి వారు పట్టించుకోలేదు. దీంతో చంద్రశేఖర్‌ కాంట్రాక్టరు, కంపెనీ సిబ్బంది వద్దకు వెళ్లి గట్టిగా అడిగాడు. అయితే భూమి చదును చేపట్టకపోగా, బెదిరింపులకు దిగుతున్నారని రైతు చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన పొలంలోని అంత పెద్ద గుంతను పూడ్చడానికి రూ. 25 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు ఖర్చు అవుతుందని కన్నీరుమున్నీరు అవుతున్నాడు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2025 | 12:22 AM

News Hub