PABR : కుడికాలవ కింద చెరువులను నింపాలి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:33 AM
పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలను నీటితో నింపాలని జిల్లా పండ్లతోటల రైతుసంఘం నాయకులు కోరారు. వారు బుధవారం పీఏబీ ఆర్, జీడిపల్లి రిజర్వాయర్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ... పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న సగం చెరువులను మాత్రమే నీటితో నింపు తామని జలవనరుల శాఖ అధికారులు చెప్పడం సరికాదన్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలను నీటితో నింపాలని జిల్లా పండ్లతోటల రైతుసంఘం నాయకులు కోరారు. వారు బుధవారం పీఏబీ ఆర్, జీడిపల్లి రిజర్వాయర్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ... పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న సగం చెరువులను మాత్రమే నీటితో నింపు తామని జలవనరుల శాఖ అధికారులు చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, రైతుల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని సాగునీటికి అవకాశం కల్పించాలన్నారు. పీఏబీఆర్ కుడికాలవ కింద ఉన్న చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి, రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలన్నారు. అంతేగాక ఆయా ప్రాంతాలకు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పండ్లతోటల రైతుసంఘం అధ్యక్షుడు అనంతరా ముడు, ఉపాధ్యక్షులు నారపరెడ్డి, ఆనంద్, కార్యదర్శి గోనుగుంట్ల మురళీమోహన చౌదరి, సహాయ కార్యదర్శులు సంజీవరా యుడు, రవీంద్రనాయుడు, గిరి, గోవిందు, ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....