Share News

KABADDI : కబడ్డీ పోటీల విజేతలు ఆర్డీటీ, డీఎస్‌ఏ జట్లు

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:34 AM

జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా ఆర్డీటీ, డీఎస్‌ఏ జట్లు నిలిచాయి. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక అశోక్‌నగర్‌ డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో వివేకానంద స్పోర్ట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.

KABADDI : కబడ్డీ పోటీల విజేతలు ఆర్డీటీ, డీఎస్‌ఏ జట్లు
Girls Kabaddi winner is RDT team

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా ఆర్డీటీ, డీఎస్‌ఏ జట్లు నిలిచాయి. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక అశోక్‌నగర్‌ డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో వివేకానంద స్పోర్ట్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో విజేతగా ఆర్డీటీ స్పోర్ట్స్‌ విలేజ్‌ జట్టు, ద్వితీయ స్థానంలో కేఎస్‌ఆర్‌ బాలికల జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో విజేతగా డీఎస్‌ఏ వివేకానంద జట్టు, ద్వితీయ స్థానంలో ఙ ధర్మవరం ఆర్డీటీ జట్టు గెలుపొందాయి. అంతకు ముందు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద స్పూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని అధికారులు సూచించారు. అనంతరం కస్టమ్స్‌ అధికారి ఐఆర్‌ఎస్‌ లోకనాథ్‌రెడ్డి, విద్యుత్తుశాఖ విజిలెన్స సీఐ విశ్వనాథ్‌చౌదరి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాప్‌ కబడ్డీ కోచ అనీల్‌కుమార్‌, కోచ సంధ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌రెడ్డి, న్యాయవాది మురళీధర్‌, ఆర్డీటీ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు, పీడీలు, కోచలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 13 , 2025 | 12:34 AM