RTC : జరిమానాలతో ఇబ్బందులు
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:30 AM
ప్రయాణి కుల ద్వారా జరిమానాలు వసూలు చేసేందుకు ఆర్టీసీ భద్రతా సిబ్బంది అత్యుత్సాహం కనబరుస్తున్నారు. వృద్ధుల నే కనికరం లేకుండా అందరిపై విరుచుకుపడుతున్నారు. తమవారిని బస్సు ఎక్కించేందుకు బస్టాండుకు వచ్చామని చెబుతున్నా వినిపించుకోకపోతుండడం వల్ల ప్రయణికులు అసహ నానికి గురవుతున్నారు.
బస్టాండులో ప్రయాణికులపై ఆర్టీసీ భద్రతా సిబ్బంది ప్రతాపం
అనంతపురం కల్చరల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రయాణి కుల ద్వారా జరిమానాలు వసూలు చేసేందుకు ఆర్టీసీ భద్రతా సిబ్బంది అత్యుత్సాహం కనబరుస్తున్నారు. వృద్ధుల నే కనికరం లేకుండా అందరిపై విరుచుకుపడుతున్నారు. తమవారిని బస్సు ఎక్కించేందుకు బస్టాండుకు వచ్చామని చెబుతున్నా వినిపించుకోకపోతుండడం వల్ల ప్రయణికులు అసహ నానికి గురవుతున్నారు. బుధవారం ప్రసాద్ అనే వ్యక్తి తన సోదరిని బస్సు ఎక్కించేం దుకు అనంతపురం బస్టాండులోని ఎగ్జిట్ గేట్ గుండా బస్టాండు వెనుక భాగాన రిజర్వేషన కౌంటర్ ద్వారం వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చాడు. అలాగే మరో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి, ప్రజాస్వా మ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అల్తాఫ్ కూడా ఇదే మార్గంలో బస్టాండుకు చేరు కున్నారు. గమనించిన ఆర్టీసీ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని రూ.300 జరిమా నా కట్టాలన్నారు. లేదంటే కేసు పెడతామంటూ సెల్‌ఫోన లో ఫొటోలు తీసుకుంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై ఆర్‌ఎంకు ఫిర్యాదు చేస్తామని ఆ ప్రయాణికులు ఆర్టీసీ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఎవ్వరితోనైనా చెప్పుకో అంటూ సిబ్బంది తెగేసి చెబుతుం డడంతో పయ్రాణికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉంటున్నారు. పైగా జరిమానాలతో విరుచుకు పడు తుండడంతో ప్రయాణికులు బేజారెత్తిపోతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....